ఆంధ్రప్రదేశ్​Vishaka Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ముగ్గురి దుర్మరణం.....

Vishaka Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ముగ్గురి దుర్మరణం.. పలువురికి గాయాలు

విశాఖపట్నం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి రామభద్రాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vishaka Road Accident | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం Vishakapatnam జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

గాజువాక పరిధిలోని శ్రీనగర్ ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజమండ్రి నుంచి విజయనగరం జిల్లా రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది.

Vishaka Road Accident

Vishaka Road Accident | కొంద‌రి ప‌రిస్థితి విష‌మం..

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బస్సులో Bus ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మ అనే మహిళతో పాటు మరో ప్రయాణికుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

Bus Accident

Vishaka Road Accident | ట్రాఫిక్‌కు అంతరాయం

ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు Traffic అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

ప్రమాదానికి అతివేగం, డ్రైవర్‌కు ముందున్న లారీ కనిపించకపోవడం లేదా ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.ఈ విషాదకర ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలకు స్థానిక ప్రజలు, ప్రయాణికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...