అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Overseas Scholarships | మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ సఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు.
విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తోంది. మైనారిటీ విద్యార్థుల (Minority students) కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి తాజాగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి ఉపకారవేతన పథకం కింద విదేశాలలో పీజీ (PG), పీహెచ్డీ (PhD) చేసే వారికి ఆర్థిక సాయం అందనుంది.
CM Overseas Scholarships | వీరు అర్హులు
సంబంధిత స్కాలర్షిప్ పొందడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉండాలి. అంతేగాకుండా జనవరి 1 నుంచి జూన్ 30 వరకు విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్/డాక్టోరల్ కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం సంబంధిత జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయాలలో హార్డ్ కాపీలు/అవసరమైన పత్రాలను జులై 31లోగా సమర్పించాలి. పథకం వివరాలు, అర్హతా ప్రమాణాలు, దరఖాస్తు చేసుకోవలసిన దేశాలు వంటి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
Applications Open for CM’s Overseas Scholarship Scheme 2026 for Minority Students
Financial Assistance for Overseas PG and PhD Studies Under Chief Minister’s Scholarship Scheme pic.twitter.com/wbGjvBAhN3
— Jacob Ross (@JacobBhoompag) May 31, 2026
దీనిని కూడా చదవండి : Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ


