IPL Final Driving | ఐపీఎల్​ ఫైనల్​ చూస్తూ డ్రైవింగ్​.. బావిలోకి దూసుకెళ్లిన కారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Final Driving | దేశంలో ఐపీఎల్​కు ఉన్న క్రేజ్​ గురించి తెలిసిందే. నిత్యం కోట్లాది మంది ఐపీఎల్ మ్యాచ్​లను చూశారు. ఇక ఫైనల్ మ్యాచ్​ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మ్యాచ్​ చూస్తూ కారు డ్రైవ్​ చేయడంతో యువకులు ప్రమాదం బారిన పడ్డారు.

IPL Final Driving

డ్రైవింగ్​ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అయినా కూడా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఫోన్​ మాట్లాడుతూ.. కార్లలో సినిమాలు చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటారు. తాజాగా జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపెల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది.

IPL Final Driving | ఒకరి మృతి

నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు యువకులు థార్‌ వాహనంలో మొబైల్‌లో ఐపీఎల్‌ ఫైనల్ (IPL Final) మ్యాచ్‌ చూస్తూ ప్రయాణించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్‌ చేస్తున్న జగిత్యాలకు చెందిన అరుణ్ బావిలో మునిగి మృతి చెందగా.. నివేష్, అశ్విన్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు రెండు గంటలు శ్రమించి అరుణ్ మృతదేహాన్ని, కారును బయటకు తీశారు. ఈ ఘటనతో యువకుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి..: Velpur VDC | సాంఘిక బహిష్కరణ చేశారని గంగపుత్రుల ఆవేదన.. వీడీసీపై కలెక్టర్​కు ఫిర్యాదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *