UPI Transactions Record | యూపీఐ జోరు.. మేలో సరికొత్త రికార్డు

Balla Sandeep Kumar

అక్షరటుడే, బాల్కొండ: UPI Transactions Record | భారతీయులు ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడంలో దిట్టలుగా మారిపోయారు. ప్రధానంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ విధానం అందరి జీవితాల్లో భాగమైంది. టీ కొట్టు వద్దనుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్ ల వరకు.. ఒక రూపాయి దానం నుంచి లక్షల రూపాయల ట్రాన్జాక్షన్ల వరకు యూపీఐ ద్వారానే చేసేస్తున్నారు. దీంతో ప్రతినెలా రికార్డు స్థాయిలో ట్రాన్జాక్షన్లు నమోదవుతున్నాయి.

UPI Transactions Record | 2 కోట్ల లావాదేవీలతో మొదలై..

UPI Transactions Record

భారత్ లో యూపీఐ ఒక డిజిటల్ విప్లవాన్ని తెచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనిని ప్రవేశపెట్టింది. ఆ ఏడాది 2 కోట్ల లావాదేవీలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) యూపీఐని ప్రోత్సహించడం, పెద్దపెద్ద షాపింగ్ మాల్‌లు, సూపర్ మార్కెట్లే కాకుండా కిరాణా దుకాణాలు, టీకొట్టుల్లోనూ ఈ విధానంలో పేమెంట్లు స్వీకరిస్తుండడంతో క్రమంగా జనం అలవాటు పడ్డారు. చిల్లర సమస్య లేకపోవడంతో దేనికైనా యÖపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. దీంతో రికార్డుస్థాయిలో లావాదేవీలు నమోదవుతున్నాయి. గతనెలలో 2,320 కోట్ల లావాదేవీలు జరగడం గమనార్హం.

UPI Transactions Record | రూ. 29.90 లక్షల కోట్ల లావాదేవీలు..

ఈ ఏడాది మే నెలలో రూ. 29.90 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. సంఖ్యా పరంగా 2,320 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కాగా గతేడాది మేలో ఈ సంఖ్య 1,867 కోట్లు (రూ. 25.14 లక్షల కోట్ల విలువ) గా ఉంది. అంటే లావాదేవీల సంఖ్య ఏకంగా 24 శాతం పెరిగిందన్న మాట. సాధారణంగా మార్చి నెలలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వల్ల లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. కానీ మే నెలలో ఆ రికార్డులన్నీ బద్దలైపోయాయి.

UPI Transactions Record | 85 శాతం వాటా యూపీఐదే..

UPI Transactions Record

రోజువారీ సగటున చూసుకుంటే మే నెలలో ప్రతిరోజూ 74.8 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగాయి. అంటే రోజుకు దాదాపు 96,465 కోట్ల రూపాయల లావాదేవీలు కేవలం ఫోన్ల ద్వారానే పూర్తయ్యాయి. ప్రస్తుతం దేశీయ డిజిటల్ లావాదేవీలలో 85 శాతం వాటా యూపీఐదే కావడం విశేషం. ప్రపంచంలో జరిగే మొత్తం రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్‌లో దాదాపు సగం వాటాను మన యూపీఐ ఒక్కటే నమోదు చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

UPI Transactions Record | ఫోన్ పేదే ఆధిపత్యం..

యూపీఐ మార్కెట్‌లో ఫోన్‌పే (Phone Pay) ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం లావాదేవీలలో 48 శాతం వాటా ఈ కంపెనీదే.. 35 శాతం వాటాతో గూగుల్ పే రెండో స్థానంలో ఉంది. యూపీఐ లావాదేవీలు భారత్‌లోనే కాకుండా యూఏఈ, సింగపూర్, శ్రీలంక, ఫ్రాన్స్, ఖతార్ సహా ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి..: Flex Fuel Bike | ఇక పెట్రోల్ చింత అక్కర్లేదు.. త్వరలో మార్కెట్ లోకి ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *