లైఫ్​ స్టైల్​Dengue Season Alert | జ్వరం వస్తే సొంత వైద్యాలు వద్దు.. డెంగ్యూపై నిపుణుల కీలక...

Dengue Season Alert | జ్వరం వస్తే సొంత వైద్యాలు వద్దు.. డెంగ్యూపై నిపుణుల కీలక సూచనలు

నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు దోమల వ్యాప్తికి అనుకూలంగా మారుతున్నాయని, డెంగ్యూ సీజన్‌లోకి ప్రవేశిస్తున్న వేళ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని డయాగ్నస్టిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: Dengue Season Alert | నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు దోమల వ్యాప్తికి అనుకూలంగా మారుతున్నాయని, డెంగ్యూ ( Dengue)  సీజన్‌లోకి ప్రవేశిస్తున్న వేళ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని డయాగ్నస్టిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ నెల ప్రారంభంతో డెంగ్యూ ముప్పు పెరుగుతున్నందున, వస్తున్న జ్వరాన్ని “సాధారణ వైరల్ జ్వరమే కదా” అని నిర్లక్ష్యం చేయవద్దని హెల్త్‌కేర్ నిపుణులు కోరుతున్నారు. వర్షాకాలంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, సీజన్ ప్రారంభ దశలోనే ముందస్తు సంసిద్ధత, సరైన సమయంలో వ్యాధిని గుర్తించడం ద్వారా తదుపరి వచ్చే తీవ్రమైన అనారోగ్య సమస్యలను అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Dengue Season Alert | ముందే పెరుగుతున్న కేసులు..

గత సంవత్సర నివేదికల ప్రకారం, తెలంగాణలో ఏప్రిల్ , జూన్ మధ్య కాలంలోనే వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ కేసులు పెరగడం ప్రారంభమైంది. నగరంలో నీరు నిల్వ ఉండటం, అప్పుడప్పుడు కురిసే జల్లులు, జనసాంద్రత , మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల హైదరాబాద్ ఎల్లప్పుడూ ఈ వ్యాధుల బారిన పడే ప్రమాదంలోనే ఉంటుంది. డెంగ్యూ తీవ్రత అనేది కేవలం వర్షాకాలం గరిష్ట స్థాయికి చేరిన నెలలకే పరిమితం కావడం లేదు. అనేక ఏళ్లుగా భారీ వర్షాలు కురవడానికి ముందే, ఈ సీజన్ ప్రారంభంలోనే జ్వరాల బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
dengu

Dengue Season Alert | సాధారణ జ్వరంగా భావిస్తే ప్రాణాంతకమే..

డెంగ్యూ ప్రారంభ లక్షణాలు చాలావరకు సాధారణ వైరల్ జ్వరం, ఫ్లూ లేదా జీర్ణకోశ ఇన్ఫెక్షన్ల వలె ఉంటాయని హైదరాబాద్ న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ పాథాలజిస్ట్ డాక్టర్ అంకిత శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం నగరంలో డెంగ్యూతో పాటు చికెన్ గున్యా, టైఫాయిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయన్నారు. ఈ కాలంలో స్కూలు పిల్లలు, బయట గడిపే యువత ఈ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువని, వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే ప్లేట్‌లెట్లు పడిపోవడం, అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్), డీహైడ్రేషన్ , మల్టీ-ఆర్గన్ దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చునని ఆమె హెచ్చరించారు.

Dengue Season Alert | సొంత వైద్యం వద్దు..

డెంగ్యూ నివారణలో ఎదురవుతున్న ప్రధాన సవాలు ముందస్తుగా గుర్తించకపోవడమే. జ్వరం, తలనొప్పి, అలసట, ఒంటి నొప్పులు వంటి లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఇంట్లోనే సొంత వైద్యం చేసుకోవడం వల్ల పరిస్థితి విషమిస్తోంది. అలాగే, కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయే వరకు వేచి చూడటం ముమ్మాటికీ తప్పని, వైద్య సహాయం కోసం ముందస్తు క్లినికల్ అసెస్‌మెంట్ , డయాగ్నస్టిక్ పరీక్షలు ఎంతో ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
dengu 2

Dengue Season Alert | నివారణే మార్గం..

నగరంలో అప్పుడప్పుడు కురిసే జల్లులు, ఉక్కపోత, నిర్మాణ స్థలాలు (కన్స్ట్రక్షన్ సైట్స్), కూలర్లు, టెర్రస్‌లపై నిలిచిన నీరు దోమల ఎదుగుదలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. దక్షిణ భారత వ్యాప్తంగా వేగంగా జరుగుతున్న పట్టణీకరణ వల్ల దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. ఏటా పెరిగే ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని.. ప్రజల్లో అవగాహన, ముందస్తు పరీక్షలు, శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవడం (హైడ్రేషన్) , సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం ఎంతో కీలకమని హెల్త్‌కేర్ నిపుణులు నొక్కి చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  Annamalai Resignation | బీజేపీకి అన్నామలై రాజీనామా.. సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...