Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

SanDisk Creator Series | క్రియేటర్స్ కోసం వన్‌స్టాప్ సొల్యూషన్.. సరికొత్త హై-స్పీడ్ ప్రొడక్ట్స్‌ను తెచ్చిన సాన్‌డిస్క్

Shivam nagarani
Last updated: June 3, 2026, 7:59 pm 7:59 pm
Shivam nagarani
Share
sandisk

అక్షరటుడే వె‌డెస్క్: SanDisk Creator Series | డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల అవసరాలు, వారి ఫాస్ట్ లైఫ్ స్టైల్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్ సాన్‌డిస్క్ (SanDisk) ప్రొఫెషనల్-గ్రేడ్ ‘క్రియేటర్ సిరీస్’ (Creator Series) ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తెచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీ (New delhi) వేదికగా ఈ సరికొత్త స్టోరేజ్ డివైజెస్ అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది.

SanDisk Creator Series | వర్క్‌ఫ్లోలకు అద్భుతమైన వేగం..

ఈ సాన్‌డిస్క్ క్రియేటర్ సిరీస్ ఉత్పత్తులు హై-రిజల్యూషన్ వీడియోలు, అత్యాధునిక జనరేటివ్ AI ప్రాజెక్టుల నిర్వహణకు అద్భుతమైన వేగాన్ని, మన్నికను అందిస్తాయి. 4K వీడియోల రికార్డింగ్, భారీ ఫైళ్ల బ్యాకప్, ఎడిటింగ్ వంటి పనులను క్రియేటర్లు చాలా వేగంగా, సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తుల కొనుగోలుపై మూడు నెలల అడోబ్ లైట్‌రూమ్ లేదా ఒక నెల అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ ఉచిత సభ్యత్వం లభిస్తుంది.

సృజనాత్మకతను విస్తరించే సరికొత్త సాంకేతికత..

నేటి కంటెంట్ క్రియేటర్లు తరచుగా వేర్వేరు పరికరాలు, విభిన్న ఫార్మాట్లతో పని చేయాల్సి రావడం పెద్ద సవాలుగా మారిందని సాన్‌డిస్క్ వైస్ ప్రెసిడెంట్ సుబింద్ కుమార్ తెలిపారు. ఈ క్రియేటర్ సిరీస్ వారి రోజువారీ పనిని సులభతరం చేయడంతో పాటు, సృజనాత్మకతను పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తూ ముందుకు సాగేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

SanDisk Creator Series | సాన్‌డిస్క్ క్రియేటర్ ఫోన్ SSD ప్రత్యేకతలు..

మ్యాగ్‌సేఫ్ సపోర్ట్‌తో వచ్చే ఈ SSD, ఐఫోన్ వెనుక సులభంగా అతుక్కుపోతుంది. ముఖ్యంగా iPhone 15 Pro/Pro Max , iPhone 16 సిరీస్ కోసం రూపొందించిన ఈ డ్రైవ్, Apple ProRes 4K వీడియోలను 60fps వద్ద నేరుగా డ్రైవ్‌లోనే రికార్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. దీనికి 3 మీటర్ల డ్రాప్ ప్రొటెక్షన్, IP65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. 1TB, 2TB కెపాసిటీల్లో లభించే దీని ప్రారంభ ధర రూ.20,999. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉంది.

సాన్‌డిస్క్ క్రియేటర్ మైక్రోఎస్‌డీ కార్డ్ ఫీచర్లు..
అడాప్టర్‌తో కూడిన ఈ హై-పర్‌ఫార్మెన్స్ కార్డ్ స్మార్ట్‌ఫోన్, డ్రోన్ లేదా యాక్షన్ కెమెరాలలో 4K, 5.3K వీడియోలను సులభంగా షూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది 190MB/s వరకు వేగవంతమైన రీడ్ స్పీడ్‌ను అందిస్తుంది. ఉష్ణోగ్రత నిరోధకత, డ్రాప్-ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్ ఫీచర్లతో వచ్చే ఈ 1TB కార్డ్ ప్రారంభ ధర రూ.3,499. ఇది అమెజాన్‌లో లభ్యమవుతోంది.

sandisk.1

SanDisk Creator Series | సాన్‌డిస్క్ క్రియేటర్ SD UHS-II కార్డ్ వివరాలు..

ప్రొఫెషనల్ కెమెరాల కోసం డిజైన్ చేసిన ఈ మెమరీ కార్డ్, 280MB/s వరకు అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌ను అందిస్తుంది. భారీ 6K వీడియో రికార్డింగ్, RAW ఫైల్స్ ఎడిటింగ్‌కు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. పొరపాటో డేటా డిలీట్ అయితే రికవరీ చేసుకునేందుకు ‘రెస్క్యూప్రో డీలక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా ఇస్తున్నారు. 1TB కెపాసిటీ గల ఈ కార్డ్ ధర రూ.13,099 నుంచి ప్రారంభమవుతుంది.

సాన్‌డిస్క్ క్రియేటర్ USB-C ఫ్లాష్ డ్రైవ్ సామర్థ్యం..
ప్రయాణంలో ఉండే క్రియేటర్లకు స్టైలిష్ లుక్‌తో పాటు తిరుగులేని వేగాన్ని అందించడానికి ఈ పెన్ డ్రైవ్ ఉపయోగపడుతుంది. ఇది తాజా USB-C పోర్ట్ గల కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లలో 400MB/s వరకు హై-స్పీడ్‌తో ఫైల్స్ బదిలీ చేస్తుంది. 1TB వరకు స్టోరేజ్ లభించే ఈ ఫ్లాష్ డ్రైవ్ ప్రారంభ ధర రూ.17,999. ఇది అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

sandisk.2

SanDisk Creator Series | సాన్‌డిస్క్ క్రియేటర్ ఫోన్ డ్రైవ్ ప్రయోజనాలు..

ఇందులో డ్యూయల్ లైట్నింగ్ , USB-C కనెక్టర్లు ఉండటం వల్ల ఐఫోన్, ఐపాడ్, Mac, Android, PCల మధ్య డేటాను ఎలాంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేయవచ్చు. మన్నికైన మెటల్ డిజైన్‌తో వచ్చే ఈ డ్రైవ్ కొనుగోలుపై మూడు నెలల అడోబ్ లైట్‌రూమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 256GB వరకు లభించే ఈ ఫోన్ డ్రైవ్ ప్రారంభ ధర రూ.18,499.

కంటెంట్ క్రియేటర్లు తాము తీసే ప్రతి షాట్, ఫైల్ బదిలీ, ఎడిటింగ్ , డేటా బ్యాకప్‌లపై పూర్తి నియంత్రణను కలిగి ఉండేలా సాన్‌డిస్క్ ఈ సరికొత్త ‘క్రియేటర్ సిరీస్’ను ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తెచ్చింది.

ఇది కూడా చదవండి: ACB Raids Bhujangarao | భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు

TAGGED:Content CreatorsCreator StorageExternal SSDlatest newsMicroSD CardSanDisk Creator SeriesSanDisk IndiaTech News Indiatelugu newsUSB-C Flash Drive
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Indiramma house Indiramma house | ఇందిరమ్మ ఇల్లు కోసం కలెక్టరేట్​కు పాదయాత్ర.. స్వయంగా ముగ్గు పోసిన అడిషనల్ కలెక్టర్
Next Article Woman Death Kamareddy Woman Death Kamareddy | కూలీకి వెళ్లిన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

India Stock Market
బిజినెస్​

India Stock Market | 7వ స్థానానికి పడిపోయిన భారత స్టాక్ మార్కెట్

By Balla Sandeep Kumar
Stock Market Gains
బిజినెస్​

Stock Market Gains | భారీ లాభాల్లో మార్కెట్లు

By Srinivas Kolluri
Karimnagar ACB Raid
కరీంనగర్

Karimnagar ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్వేయర్ .. అరెస్ట్ చేసిన ఏసీబీ

By Shivam nagarani
Bakrid Cow Slaughter PIL
జాతీయం

Bakrid Cow Slaughter PIL | గోవధ నిషేధ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.