అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే సుదీర్ఘంగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణ, పెరిగిన ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణానికి ముప్పు వాటిల్లవచ్చన్న హెచ్చరికలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఆర్బీఐ 2027 ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణ అంచనాను పెంచడంతో మదుపరులు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.
Stock Market Losses | నష్టాలలో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) క్రవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 88 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 729 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 37 పాయింట్లు ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 234 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 116 పాయింట్ల నష్టంతో 74,243 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 23,366 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Losses | మిక్స్‌డ్‌గా సూచీలు..
నిఫ్టీ (Nifty) మీడియా ఇండెక్స్ 3.48 శాతం, యుటిలిటీ 0.60 శాతం, రియాలిటీ 0.56 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.45 శాతం లాభపడగా.. మెటల్ ఇండెక్స్ 1.60 శాతం, టెలికాం 1.52 శాతం, ఐటీ సూచీ 0.99 శాతం, ఎనర్జీ 0.72 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.48 శాతం నష్టపోయాయి.
Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,056 కంపెనీలు లాభపడగా 2,138 స్టాక్స్ నష్టపోయాయి. 205 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 133 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 67 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్ లాభపడగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్యూఎల్ 2.10 శాతం, అదానీపోర్ట్స్ 1.82 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.75 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.66 శాతం, ఆసియన్ పెయింట్ 0.88 శాతం లాభపడ్డాయి.
Top Losers : ట్రెంట్ 2.21 శాతం, టీసీఎస్ 1.85 శాతం, టాటా స్టీల్ 1.78 శాతం, ఎన్టీపీసీ 1.28 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.20 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Today | ఊగిసలాటలో మార్కెట్లు..
