అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telugu Youth Murder | అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ న్యూయార్క్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
Telugu Youth Murder | తుపాకీతో కాల్పులు
నిన్న అర్ధరాత్రి పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర బుల్లెట్ గాయాల పాలైన అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో అన్షుల్ కుటుంబ సభ్యులు, స్వగ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Modi Trump Meeting | యుద్ధ సంక్షోభం వేళ మోదీ- ట్రంప్ కీలక భేటీ..?
