Bengaluru Murder Case | ప్రపోజ్​ చేస్తానని ప్రాణం తీసిన ప్రియురాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengaluru Murder Case | ఓ యువతి తన ప్రియుడికి ప్రపోజ్​ చేస్తానని చెప్పి ప్రాణాలు తీసింది. కొత్త స్టైల్​లో లవ్​ను ఎక్స్​ప్రెస్ చేస్తానని బాయ్​ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి.. కిరోసిన్​ పోసి నిప్పు అంటించింది. ఈ ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన బైదరహళ్లి పోలీస్ స్టేషన్ (Byadarahalli Police Station) పరిధిలోని అంజనానగర్‌లోని ఒక ఇంట్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. కిరణ్ (27) అనే యువకుడు ప్రేరణ అనే యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ప్రేరణ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అతడు ఆమె ఇంటికి వెళ్లారు. వీరు ఇద్దరు ఒక ప్రైవేట్ టెలికాం సంస్థలో పని చేస్తున్నారు. ఆమె కిరణ్ కళ్లకు గంతలు కట్టి, సర్​ప్రైజ్​ ప్రపోజల్ చేస్తానని చెప్పి కుర్చీకి కట్టేసింది. ఆ తర్వాత అతని బట్టలు తొలగించి, అతని దృష్టి మరల్చి, ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్, కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

Bengaluru Murder Case

Bengaluru Murder Case | ఫోన్​లో రికార్డు

నిందితురాలి ఫోన్‌లో రికార్డ్ అయిన ఘటన వీడియోను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తాను బాత్రూంలో ఉండగా బయటకు వచ్చి చూసేసరికి కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రేరణ పోలీసులను నమ్మించే యత్నం చేసింది. అయితే అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో తానే చంపినట్లు నిందితురాలు ఒప్పుకుంది. ఈ జంటకు తరచుగా గొడవలు జరిగేవని, కిరణ్ దూరమవుతున్నాడని ప్రేరణ భావించేదని పోలీసులు తెలిపారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Pahalgam Terror Attack | ప‌హ‌ల్గాం నెత్తుటి జ్ఞాప‌కానికి ఏడాది.. ఉగ్రదాడి స్థలంలో ధైర్యంగా నివాళుల‌ర్పించిన 15 ఏళ్ల బాలిక‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *