అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Airport Marijuana Seizure | ఢిల్లీ ఎయిర్పోర్టు (Delhi Airport)లో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇతర దేశాల నుంచి గంజాయి తీసుకు వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు (Customs Officers) సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో కౌలాలంపూర్ (Kuala Lumpur) నుండి D7-182 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఆ ప్రయాణికులు తమ సాధారణ లగేజీతో పాటు రెండు కొత్త గీజర్‌లను కూడా తీసుకువెళుతున్నట్లు అధికారులు గమనించారు.
Delhi Airport Marijuana Seizure | దొరకకుండా..
సుదీర్ఘ విచారణ, మొబైల్ ఫోన్ సంభాషణల పరిశీలన తర్వాత, ఆ గీజర్‌లలో ఉన్న వస్తువుల పట్ల అధికారులకు అనుమానం కలిగింది. దీంతో ఆ పరికరాలను ఎక్స్-రే పరీక్షకు గురిచేయగా, వాటి అంతర్గత నిర్మాణంలో ఏదో పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత రెండు గీజర్‌లను విడదీసి చూడగా అందులో గంజాయి ఉంది. అధికారులకు చిక్కకుండా నిందితులు పక్కాగా గీజర్లో లోపల దాచిన 145 వాక్యూమ్-సీల్డ్ ప్యాకెట్లను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్లను పరిశీలించగా, అందులో హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Cannabis) ఉంది.
Delhi Airport Marijuana Seizure | రూ.5.38 కోట్లు

స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యం మొత్తం బరువు 15.38 కిలోలుగా అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకు అంచనా విలువ సుమారు రూ.5.38 కోట్లు ఉంటుంది. స్వాధీనం చేసుకున్న గంజాయిని NDPS చట్టం ప్రకారం జప్తు చేశారు. ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.
గీజర్లో గంజాయి.. పట్టుకున్న ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు
న్యూఢిల్లీ IGI విమానాశ్రయంలో భారీ హైడ్రోపోనిక్ గంజాయి అక్రమ రవాణా ప్రయత్నాన్ని కస్టమ్స్ అడ్డుకున్నారు. గీజర్‌ల లోపల దాచిన 15.38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తనిఖీ… pic.twitter.com/Go62LR9kEj
— Akshara Today | Telugu News (@aksharatoday) June 8, 2026
ఇది కూడా చదవండి..: Air India Aircraft Damage | విమానాలను ఢీకొన్న గ్రౌండ్ సపోర్టు పరికరాలు.. 3 ఫ్లైట్లు ధ్వంసం
