GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ బదిలీ

జిల్లా జనరల్​ ఆస్పత్రి ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ డీఎంఈ నుంచి ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు అందాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GGH Nizamabad | జిల్లా జనరల్​ ఆస్పత్రి ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ బదిలీ (Nagamohan Transfer) అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ డీఎంఈ(DME) నుంచి ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు అందాయి.

GGH Nizamabad | కొన్నిరోజుల క్రితమే బాధ్యతలు

నగరంలోని (Nizamabad) మెడికల్​ కళాశాలలో (Medical College Nizamabad) ఫోరెన్సిడ్​ డిపార్ట్​మెంట్​ ప్రొఫెసర్​గా ఉన్న నాగమోహన్​కు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జీజీహెచ్(Government General Hospital Nizamabad)​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ సందర్భంగా ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయనను ఆకస్మికంగా గాంధీ మెడికల్​ కళాశాల (Gandhi Medical College) ఫోరెన్సిక్​ మెడిసిన్​ ప్రొఫెసర్​గా బదిలీ చేస్తూ డీఎంఈ ఆదేశాలు జారీ చేసింది.

Woman Prisoner Missing

ఇది కూడా చదవండి: Air India Aircraft Damage | విమానాలను ఢీకొన్న గ్రౌండ్ సపోర్టు పరికరాలు.. 3 ఫ్లైట్లు ధ్వంసం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *