అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Abhishek Sharma L celebration | ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు బ్యాటింగ్ దళం అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. ముఖ్యంగా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగి, ఉప్పల్ స్టేడియాన్ని సందడిగా మార్చాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు.
మొత్తం 68 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 135 పరుగులు సాధించాడు. ఆయన అద్భుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (Delhi Capitals) సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ ప్రదర్శనతో అభిషేక్ టీ20ల్లో 5,500 పరుగుల మైలురాయిని చేరడంతో పాటు, తన కెరీర్‌లో 9వ సెంచరీ (ఐపీఎల్‌లో రెండోది) నమోదు చేశాడు.
Abhishek Sharma L celebration | ‘ఎల్’ సెలబ్రేషన్ వెనుక భావం
అభిషేక్ శర్మ సెంచరీ లేదా కీలక ఘట్టాల తర్వాత చేసే ‘ఎల్’ సెలబ్రేషన్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీనిపై స్పందిస్తూ …“‘ఎల్’ అంటే నా దృష్టిలో Love (ప్రేమ), Loyalty (విశ్వసనీయత). ఉప్పల్ నా హోమ్ గ్రౌండ్ లాంటిది. ఇక్కడి అభిమానులు నాపై చూపించే ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని భావోద్వేగంగా చెప్పారు. ఈ మ్యాచ్‌లో తన తల్లిదండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకమని అభిషేక్ పేర్కొన్నాడు. గ్యాలరీలో వాళ్లు ఉండగా ఈ శతకం సాధించడం నా కల నిజమైనట్టే అనిపించింది అని చెప్పాడు. తన ‘ఎల్’ సెలబ్రేషన్‌ను కుటుంబ సభ్యులకు, అలాగే జట్టుపై విశ్వాసం ఉంచిన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు.

Abhishek Sharma L celebration | యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ
2024 నుంచి జట్టులో వచ్చిన మార్పుల గురించి కూడా అభిషేక్ మాట్లాడాడు. యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌ను ప్రశంసించాడు. ఈ సానుకూల వాతావరణమే ఇలా ఫ్రీగా ఆడడడానికి కారణమని, అందుకే ఉప్పల్ మైదానం అంటే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఐపీఎల్ 2026లో అభిషేక్ శర్మ ప్రదర్శన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాజిటివిటీని కలిగిస్తోంది. అతని దూకుడు ఇలానే కొనసాగితే ఈ సీజన్‌లో SRH మరిన్ని విజయాలు సాధించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Shreyas Iyer | సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై ప్రశ్నలు.. కెప్టెన్సీకి ఎసరు పెడుతున్న శ్రేయస్ అయ్యర్

