అక్షరటుడే, ఇందూరు: Brain Tumor Treatment | బ్రెయిన్ ట్యూమర్‌ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సాధ్యమేనని మెడికవర్ ఆస్పత్రి (Medicover Hospital) న్యూరో సర్జన్ శ్రీకృష్ణాదిత్య పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రెయిన్ ట్యూమర్ చికిత్స, విధానాలను వివరించారు.
Brain Tumor Treatment | మెదడులో అసాధారణ కణాలు పెరగడంతో..
న్యూరో సర్జన్ శ్రీకృష్ణాదిత్య (Neurosurgeon Srikrishnaditya) మాట్లాడుతూ.. బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో అసాధారణంగా కణాలు పెరగడంతో ఏర్పడుతుందన్నారు. మెదడు కణతులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణను తెలుసుకుంటే చికిత్స సులభమవుతుందని ఆయన వివరించారు. తరచూ తలనొప్పి రావడం, వాంతులు, మూర్ఛ, చూపు మందగించడం, శరీర భాగాల్లో బలహీనత, నడకలో తడబాటు, జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతాలు కావచ్చని పేర్కొన్నారు.
Brain Tumor Treatment | ప్రారంభ దశలో గుర్తిస్తే..
బ్రెయిన్ ట్యూమర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, ఆధునిక వైద్య సాంకేతికతతో ఎంఆర్ఐ (MRI), సీటీ (CT) స్కాన్‌ల ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం మైక్రోసర్జరీ, న్యూరో నావిగేషన్, ఎండోస్కోపిక్, మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతుల ద్వారా మెదడు కణితులను సురక్షితంగా తొలగించే అవకాశం ఉందన్నారు. అవసరాన్ని బట్టి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలను కూడా అందిస్తున్నామని వివరించారు.
Brain Tumor Treatment | తరచూ తలనొప్పి వస్తే..
ప్రజలు తలనొప్పిని సాధారణ సమస్యగా తీసుకుని నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వెంటనే న్యూరో వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లో ఆధునిక న్యూరోసర్జరీ సేవలు, అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలు, నిపుణుల వైద్య బృందంతో బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఇది కూడా చదవండి..: GGH Nizamabad | జీజీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ నాగమోహన్ బదిలీ
