తెలంగాణRTC Strike | సమ్మె విరమించండి.. కార్మికులను కోరిన మంత్రి పొన్నం

RTC Strike | సమ్మె విరమించండి.. కార్మికులను కోరిన మంత్రి పొన్నం

సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులను మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Strike | ఆర్టీసీ కార్మికుల (RTC Workers) సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) కోరారు.

ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు. నాలుగు వారాల్లో ఈ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం సరికాదన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. అన్ని వెంటనే పరిష్కారం అయ్యే అంశాలని తెలిపారు.

RTC Strike | ఒకటో తేదినే జీతాలు

ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్​లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ అంశాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిపై చర్చించాల్సి ఉందన్నారు. దీనిపై కమిటీ అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తామన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

RTC Strike

RTC Strike | సమస్యలు పరిష్కరించాం

తమ ప్రభుత్వం ఏర్పడగానే 2017 పీఆర్సీ క్లియర్ చేశామని, పెండింగ్ డీఏలు లేకుండా చేశామన్నారు. రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించినట్లు చెప్పారు. రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్​ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని తెలిపారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి త్వరలోనే 4,538 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మిగతా అన్ని అంశాలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇతర రూపాల్లో నిరసన తెలపాలని, సమ్మెను విరమించాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి..: Vote for Cash Case | సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు విచారణ

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...