E85 Fuel | ఆ ఇంధనంతో.. లీటర్‌పై రూ. 20 ఆదా!

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మనదేశం ఇ-85 ఇంధనాన్ని ఆవిష్కరించింది. ఇది సాధారణ పెట్రోల్ ధర కంటే లీటరుకు రూ. 20 తక్కువ.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : E85 Fuel | ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మనదేశం ఇ-85 ఇంధనాన్ని ఆవిష్కరించింది. ఇది సాధారణ పెట్రోల్ ధర కంటే లీటరుకు రూ. 20 తక్కువ.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మనదేశం ఇ-85 ఇంధనాన్ని ఆవిష్కరించింది. దీని ధర సాధారణ పెట్రోల్ ధర (Petrol price) కంటే లీటరుకు రూ. 20 తక్కువ. అయితే ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజన్ కలిగిన ప్రత్యేక బైకులు, కార్లలో మాత్రమే ఈ ఇంధనాన్ని వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న 48 పెట్రోల్ బంకుల్లో ఇ-85 ఇంధనం అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరినాటికి 500 బంకులను, వచ్చే ఏడాది చివరి నాటికి 5వేల బంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

E85 Fuel | ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగం..

మన దేశం పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధర పెరుగుతూ వస్తోంది. దీంతో మన విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఇంధన దిగుమతులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాలతోపాటు పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఇటీవలే ఇథనాల్ బ్లెండింగ్ 20 శాతానికి పెంచారు. ప్రస్తుతం మన దేశంలో ఇప్పటివరకు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతూ విక్రయిస్తున్నారు.

E85 Fuel | ఇ85 ఇంధనం అంటే?

85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఉన్న ఇంధనాన్ని ఇ85 ఇంధనంగా పేర్కొంటారు. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అధిక ఇథనాల్ మిశ్రమంతో రూపొందించిన ‘ఇ85’ను విడుదల చేశారు. పెట్రోల్ కంటే ఇథనాల్ రేటు తక్కువ కాబట్టి బంకుల్లో ఇది చౌకగా లభించనుంది. అయితే దీనిని అన్ని వాహనాలలో వాడడానికి వీలులేదు. ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజన్ కలిగిన ప్రత్యేక బైకులు, కార్లలో మాత్రమే ఈ ఇంధనాన్ని వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన మార్కెట్‌లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ , సుజుకీ జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఎఫ్ఎఫ్వీ బైకులు మాత్రమే ఈ ఇంధనానికి సపోర్ట్ చేస్తాయి. మారుతి సుజుకీì వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ కారును ప్రదర్శించినప్పటికీ.. అది ఇంకా పూర్తిస్థాయిలో కస్టమర్లకు అందుబాటులోకి రాలేదు.

ఇది కూడా చదవండి..: Delhi Airport Marijuana Seizure | గీజర్​లో గంజాయి రవాణా.. పట్టుకున్న కస్టమ్స్​ అధికారులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *