అక్షరటుడే వెబ్‌డెస్క్: Niloufer Hospital Attack | రాజధానిలోని ప్రముఖ నిలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు (JUDA) ఆందోళనకు దిగారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విధుల్లో ఉన్న ఒక పీజీ డాక్టర్‌పై రోగి బంధువులు, సహాయకులు దారుణంగా దాడికి దిగడంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు ( జూడాలు ) నిరసనకు దిగారు.
Niloufer Hospital Attack | మరో 10 మందిని వెంటేసుకొచ్చి ..
బాధిత డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి సమయంలో రోగి సహాయకులకు, విధుల్లో ఉన్న పీజీ డాక్టర్‌కు మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. ఈ క్రమంలో సదరు రోగి బంధువు డాక్టర్‌పై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా, బయటి నుంచి మరో పది మందిని వెంటేసుకొని హాస్పిటల్ వద్దకు వచ్చి డాక్టర్లను భయభ్రాంతులకు గురిచేసినట్లు జూడాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Niloufer Hospital Attack | చేతులెత్తేసిన సెక్యూరిటీ..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సెక్యూరిటీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నాయని జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడులు జరుగుతున్నా హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లప్పగించి చూస్తూ చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. పీజీ డాక్టర్‌పై దాడికి పాల్పడిన నిందితులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. తమకు పూర్తి భద్రత కల్పించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ లో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు
శనివారం అర్ధరాత్రి తర్వాత పిజి డాక్టర్ పై దాడి చేసిన రోగుల సహాయకులు
దాడి చేయడమే కాకుండా మరో 10 మందిని వేసుకొని హాస్పటల్ వద్దకు వచ్చారని ఆవేదన
దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్… pic.twitter.com/JlICJ1na2U
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 8, 2026
ఇది కూడా చదవండి: Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రాస్తారోకో..
