Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం మహిళా సదస్సు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Traffic Restrictions | రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ (Secunderabad Parade Grounds)లో మంగళవారం మహిళా సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల రాత్రి 9 గంటలకు వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

మహిళా సదస్సు నేపథ్యంలో పంజాగుట్ట-బేగంపేట్-పరేడ్ గ్రౌండ్స్ రూట్‌తో సహా 14 కీలక జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. టివోలి-ప్లాజా రోడ్డు పూర్తిగా మూసి వేయనున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయా మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. మెట్రో వినియోగించాలని, అత్యవసర సహాయానికి 8712662999 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కోరారు.

Hyderabad Traffic Restrictions | ఆ మార్గాల్లో వెళ్లొద్దు

పంజాగుట్ట గ్రీన్‌ల్యాండ్స్ బేగంపేట్ (Begumpet) నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు ఉన్న రహదారులకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. సంగీత్ ఎక్స్-రోడ్స్, వైఎంసీఏ ఎక్స్-రోడ్స్, ప్యాట్నీ ఎక్స్-రోడ్స్, ఎస్‌బీఐ ఎక్స్-రోడ్స్, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకర్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బండ్ ఎక్స్-రోడ్స్, బాలమ్రాయి ఎక్స్-రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్ ప్యారడైజ్ కూడళ్లలో ట్రాఫిక్​ రద్దీ అధికంగా ఉంటుంది. ప్రజలు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎస్పీ రోడ్డు, ఎంజీ రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్.డి. రోడ్లలో ప్రయాణించొద్దని పోలీసులు సూచించారు.

roads

Hyderabad Traffic Restrictions | ట్రాఫిక్​ మళ్లింపులు

బేగంపేట్ నుంచి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను CTO ఎక్స్ రోడ్స్ వద్ద బాలమ్రాయ్ బ్రూక్ బాండ్ – తివోలి స్వీకర్ ఉపకార్ – YMCA సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా తిరిగి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. కర్ఖానా, జేబీఎస్​ నుంచి ఎస్​బీఐ –ప్యాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్వీకర్ ఉపకార్ వద్ద వైఎంసీఏ – క్లాక్ టవర్ ప్యాట్నీ, లేదా టివోలి-బ్రూక్ బాండ్ బాలమ్రాయ్-సీటీవో వైపు మళ్లిస్తారు. ఆర్పీ రోడ్ నుంచి ఎస్‌బీఐ ‘ఎక్స్’ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్స్ వద్ద ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు. సంగీత్ ఎక్స్ రోడ్స్ నుంచి బేగంపేట్ వైపు వచ్చే వాహనాలు వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్– ప్యాట్నీ ప్యారడైజ్ మీదుగా వెళ్లాలి.

దీనిని కూడా చదవండి  : Steel Plant Accident | విశాఖ స్టీల్​ప్లాంట్​లో భారీ ప్రమాదం.. 8 మంది కార్మికుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *