అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Steel Plant Accident | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలాయి. మరుగుతున్న స్టీల్ పడటంతో 8 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఫ్యాక్టరీలోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో ప్రమాదం జరిగింది. లిక్విడ్ స్టీల్ ద్వారా బీమ్స్ తయారు చేసే ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. లాడల్ బ్లాస్ట్ అవడం ఇదే ఫస్ట్‌టైమ్ అని కార్మికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో 150 టన్నుల లిక్విడ్ స్టీల్ మెటల్ ఉన్నట్లు సమాచారం. అగ్ని మాపక సిబ్బంది, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. బ్లాస్ట్ కారణాలపై చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Steel Plant Accident | సీఎం దిగ్భ్రాంతి
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎనిమిది ఉన్నట్టు సమాచారం. గాయపడ్డ కార్మికులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.… pic.twitter.com/zq8Sh5OHKW
— Akshara Today | Telugu News (@aksharatoday) June 8, 2026
దీనిని కూడా చదవండి : Niloufer Hospital Attack | నిలోఫర్ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్‌పై దాడి.. అరెస్టు చేయాలని డిమాండ్
