Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం

హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​ అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. సైబరాబాద్‌ (Cyberabad) పరిధిలో కుండపోత వాన పడింది.

వానాకాలం సీజన్​ ప్రారంభం అయ్యాక నగరంలో మొదటి సారి వాన పలకరించింది. దీంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచింది. దీంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది.

Hyderabad Heavy Rain | ఈ ప్రాంతాల్లో..

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌లో వాన దంచికొట్టింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, లాలాగూడ, లాలాపేటతో పాటు పలు పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. హైదరాబాద్​తో పాటు పలు జిల్లాల్లో సైతం వరుణుడు కరుణించాడు. మెదక్ (Medak) జిల్లాలో మోస్తరు వర్షం పడింది. వానలు ప్రారంభం కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Mohan Naik ACB Raid | ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *