Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్​లో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్​

రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Ganja Seizure | కామారెడ్డి (Kamareddy) రైల్వేమార్గం అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఇక్కడి యువతను మత్తుకు బానిస చేసేలా నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి సరఫరా చేస్తున్నారు.  కామారెడ్డి రైల్వే స్టేషన్లో (Kamareddy Railway Station) మంగళవారం 10 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

Ganja Seizure | నాగావలి ఎక్స్​ప్రెస్​లో..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంబలఘర్ నుండి పూణే వెళ్తున్న నాగవల్లి ఎక్స్ ప్రెస్​లో(Nagavalli Express) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 10 కిలోల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన ఇద్దరు మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్, ప్రవీణ్​గా అధికారులు గుర్తించారు. నిందితులిద్దరు ఒడిస్సాలోని(Odisha) రాయ్​ ఘడ్​లో ఎండు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలోని (Maharashtra) రాయ్​పూర్​కు చేరవేస్తున్నట్టు ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని, నిందితులిద్దరిని రిమాండ్​కు తరలించామని తెలిపారు. దాడుల్లో ఎస్సై విక్రమ్ కుమార్, కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్ బల్వంత్‌రావు, ఫరీద్, సిబ్బంది రాజు, పవన్ రెడ్డి, బాబు, శరత్, వందన పాల్గొన్నారు.

kamareddy 1

ఇది కూడా చదవండి : Nizampet Dumping Yard | నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం : మంత్రి అడ్లూరి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *