Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​జాతీయం

TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్

దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీ పతనాన్ని చూస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ. 3.6 లక్షలకోట్లు తగ్గిన మార్కెట్ విలువను కోల్పోయింది.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 4:44 pm 4:44 pm
Srinivas Kolluri
Share
TCS Market Value

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TCS Market Value | భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2024 ఆగస్టులో ప్రారంభమైన పతనం.. ఈ ఏడాది మరింత స్పీడ్‌గా సాగుతోంది.

2024 ఆగస్టు చివరి నాటికి రూ. 16 లక్షలకోట్లపైనే ఉన్న మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 7.79 లక్షల కోట్లకు పడిపోవడం గమనార్హం. 2026 ప్రారంభంలో రూ. 11.6 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఐదునెలల్లోనే రూ. 3.6 లక్షలకోట్లు క్షీణించిందన్న మాట.

TCS Market Value | ఓవైపు ట్రంప్.. మరోవైపు ఏఐ..

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ఎడాపెడా విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్‌తో అన్ని కంపెనీలపై ప్రభావం పడింది. దీంతో విదేశాలకు సంప్రదాయ ఐటీ సేవలు అందించే టీసీఎస్ సైతం భారీగా నష్టపోయింది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సాంప్రదాయ అవుట్‌సోర్సింగ్ బిజినెస్ మోడల్‌ను కుదిపేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను భారీగా తగ్గించుకుంటున్నారు. దీంతో టీసీఎస్ మరింత కుదేలవుతోంది. భారతీయ ఐటీ కంపెనీలు మÖడు దశాబ్దాలుగా తక్కువ ఖర్చుతో కూడిన శ్రమ ఆధారంగా వృద్ధి చెందాయి. ఏఐ టూల్స్ ఇప్పుడు ఆ పనులను తక్కువ ఖర్చుతో వేగంగా చేసేస్తున్నాయి. దీంతో టీసీఎస్ వంటి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

TCS Market Value | స్టాక్ పనితీరు..

2024 ఆగస్టు చివరలో రూ. 4,554 వద్ద జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసిన టీసీఎస్ షేరు ధర.. ఆ తర్వాత క్రమంగా తన విలువను కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం రూ. 2,155 వద్ద ఉంది. 52 వారాల గరిష్ట ధర రూ. 3,539 కాగా.. 52 వారాల కనిష్ట ధర రూ. 2,133.

ఇది కూడా చదవండి..: Stock Market Flat | ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

TAGGED:Artificial Intelligence ImpactIndian stock marketIT Sector NewsMarket CapitalizationTata Consultancy ServicesTCS Market ValueTCS Share PriceTechnology Stocks
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Flat Stock Market Flat | ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
Next Article Nanakramguda Drug Bust Nanakramguda Drug Bust | కిరాణా షాపులో గంజాయి దందా.. గుట్టురట్టు చేసిన ఈగల్ టీం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Stock Market Crash
బిజినెస్​

Stock Market Crash | ట్రంప్ ఎఫెక్ట్ .. భారీ నష్టాల్లో ప్రధాన సూచీలు

By Balla Sandeep Kumar
April 29 Market Analysis
బిజినెస్​

April 29 Market Analysis | మిక్స్​డ్​గా గ్లోబల్ క్యూస్.. ప్లాట్​గా ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్లు!

By Naresh Chandan
Shapoor Zadran HLH
జాతీయం

Shapoor Zadran HLH | ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న క్రికెట‌ర్‌.. ఐసీయూలో చికిత్స

By Srinivas Kolluri
Vijay TVK Lead |
జాతీయం

Vijay TVK Lead | తమిళనాట దూసుకుపోతున్న దళపతి.. 68 స్థానాల్లో ఆధిక్యం

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.