Trump Warning | ఇరాన్​పై తీవ్రమైన దాడులు చేస్తాం.. ట్రంప్​ వార్నింగ్​

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ రాత్రి తీవ్రమైన దాడులు చేస్తామన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warning | ఇరాన్‌ (Iran)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ (Donald Trump) సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ రాత్రి ఇరాన్‌పై తీవ్రమైన దాడులు చేస్తామన్నారు. ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. చమురు,గ్యాస్ మార్కెట్లపై నియంత్రణ సాధిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ట్రంప్ గురువారం మాట్లాడుతూ, ఇరాన్‌పై భారీ ఎత్తున దాడులు చేస్తామన్నారు. త్వరలోనే కీలకమైన ఖార్గ్ ద్వీపంతో సహా ఇరాన్ చమురు, గ్యాస్ పరిశ్రమలపై పూర్తి నియంత్రణ సాధిస్తామని సోషల్ మీడియా పోస్ట్‌లో హెచ్చరించారు. అమెరికా, ఇరాన్‌లు వరుసగా రెండో రోజు కూడా దాడులు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఈ పోస్ట్ చేశారు.

Trump Warning | వరుస దాడులతో ఆందోళన

ఈ వారంలో పశ్చిమాసియాలో దాడులతో ఆందోళన నెలకొంది. మొదట ఇరాన్​‌‌–ఇజ్రాయెల్ మధ్య దాడులు జరిగాయి. తాజాగా రెండు రోజులుగా అమెరికా–ఇరాన్​ దాడులు చేసుకున్నాయి. అమెరికా నేరుగా ఇరాన్​పై వైమానిక దాడులు చేయగా.. ఇరాన్ అమెరికా స్థావరాలు ఉన్న దేశాలపై దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై తాము ఎదురుదాడి చేశామని ఇరాన్ తెలిపింది. ఈ దాడి కారణంగా కువైట్ తన గగనతలాన్ని చాలా గంటల పాటు మూసివేసింది.

దీనిని కూడా చదవండి : Jupally Krishna Rao | గంజాయి రవాణాపై కఠిన చర్యలు : మంత్రి జూపల్లి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *