Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Loan Money Fraud | కొత్తూరులో సైబర్ మోసం.. రూ. 16.78 లక్షలు మాయం

భవన నిర్మాణం కోసం బ్యాంకులో పొందిన లోన్ డబ్బులను సైబర్​ నేరగాళ్లు కాజేశారు.

Shivam nagarani
Last updated: June 12, 2026, 12:31 pm 12:31 pm
Shivam nagarani
Share
Loan Money Fraud

అక్షరటుడే వెబ్‌డెస్క్: Loan Money Fraud | భవన నిర్మాణం కోసం బ్యాంకులో పొందిన లోన్ డబ్బులు సైబర్ నేరగాళ్ల ( cybercrime)  చేతికి చిక్కాయి. బాధితురాలి ప్రమేయం లేకుండానే ఆమె ఖాతా నుంచి లక్షల రూపాయలు మాయమైన ఘటన షాద్‌నగర్ పరిధిలోని కొత్తూరు మున్సిపాలిటీ మినీ సిటీ కాలనీలో చోటుచేసుకుంది.

Loan Money Fraud | ఏం జరిగిందంటే..

కొత్తూరులోని మినీ సిటీ కాలనీకి చెందిన అన్న మానస, సురేష్ బాబులు ఇంటి నిర్మాణం కోసం ‘వాస్తు హౌసింగ్’ సంస్థ నుంచి రూ. 74 లక్షల రుణాన్ని పొందారు. ఇందులో భాగంగా, మే 12న రెండో విడతగా మంజూరైన రూ. 26 లక్షలను కొత్తూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మానస ఖాతాలో జమ చేశారు. ఈ నెల 9న అవసర నిమిత్తం డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన మానసకు షాకింగ్ నిజం తెలిసింది. ఖాతాలో ఉండాల్సిన రూ. 26 లక్షలకు గానూ కేవలం రూ. 748 మాత్రమే ఉన్నాయి. కంగారుపడిన ఆమె బ్యాంకు స్టేట్‌మెంట్ పరిశీలించగా, మే 12 నుంచి జూన్ 9 మధ్య గుర్తు తెలియని వ్యక్తులు తన అకౌంట్ నుంచి రూ. 1,000 నుంచి రూ. 49,000 చొప్పున పలు విడతలుగా మొత్తం రూ. 14,68,009 డ్రా చేసినట్లు గుర్తించారు.

Loan Money Fraud | మొత్తం రూ. 16,78,009 మాయం..

అంతేకాకుండా, ఆమె కరెంటు ఖాతా నుంచి కూడా జూన్ 5 నుంచి 9 తేదీల మధ్య మరో రూ. 2,10,000 నగదు బదిలీ అయినట్లు తేలింది. ఇలా మొత్తం రూ. 16,78,009 తన ఖాతా నుంచి మాయమైనట్లు గ్రహించిన మానస వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

Loan Money Fraud | పోలీసుల దర్యాప్తు..

బాధితురాలు మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసయ్య కథనం ప్రకారం, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు. లోన్ డబ్బులు ఇలా మాయం కావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి:  Petrol Bunk Bulk Purchases | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్​ బంకుల్లో బల్క్​ కొనుగోళ్లకు బ్రేక్​

TAGGED:Bank Account Fraudcyber crimeCyber Security Newsfinancial fraud indiaHousing Loan Scamlatest newsLoan Money FraudOnline Banking Scamtelugu newsUnion Bank of India
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Petrol Bunk Bulk Purchases Petrol Bunk Bulk Purchases | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్​ బంకుల్లో బల్క్​ కొనుగోళ్లకు బ్రేక్​
Next Article Meenakshi Natarajan Nomination Meenakshi Natarajan Nomination | ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారం మొత్తం ఇచ్చా : మీనాక్షి నటరాజన్​
1 Comment
  • Pingback: Kavitha Criticism | కమిటీల పేరుతో కాలయాపన..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Smita Sabharwal IAS
తెలంగాణ

Smita Sabharwal IAS | ప్రజల అధికారి ‘స్మితా సభర్వాల్’.. అంకితభావానికి నిలువెత్తు రూపం

By Naresh Chandan
R Narayana Murthy
హైదరాబాద్

R Narayana Murthy | కాపీ కొట్టి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే బ్రిడ్జీలు కూలిపోతాయి: ఆర్.నారాయణమూర్తి

By Shivam nagarani
Tonsils Surgery
లైఫ్​ స్టైల్​

Tonsils Surgery | పిల్లల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ సర్జరీ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే..

By Shivam nagarani
Jubilee Hills Honeytrap
హైదరాబాద్తెలంగాణ

Jubilee Hills Honeytrap | జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బాగోతం.. తల్లి-కొడుకుల గలీజ్ దందా వెలుగులోకి

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.