అక్షరటుడే, వెబ్‌డెస్క్: Real Spider Man Death | రక్షణ కవచాలు లేకుండా కొండలు ఎక్కే అల్-ఖాఖా ప్రమాదంలో మృతి చెందాడు. ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’గా అల్-ఖాఖా గుర్తింపు పొందాడు.
యెమెన్ (Yemen)లో తన ప్రమాదకరమైన పర్వతారోహణలకు ప్రసిద్ధి చెంది, “స్పైడర్-మ్యాన్” అనే ముద్దుపేరు పొందిన అల్-ఖకా బిన్ అంతర్, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తుండగా మరణించాడు. ఈ యువ విన్యాసకారుడు ఎలాంటి పరికరాలు లేకుండా 120 మీటర్ల హరధత్ దమ్త్ అగ్నిపర్వత బిలాన్ని అధిరోహిస్తుండగా జారిపడి చనిపోయారు.
Real Spider Man Death | భారీ ఫాలోయింగ్

యెమెన్‌లోని అత్యంత ప్రసిద్ధ ఫ్రీ క్లైంబర్లలో ఒకరైన అల్-ఖకా బిన్ అంతర్ తన ప్రమాదకరమైన రాతి అధిరోహణలతో వైరల్ అయ్యాడు. తన విన్యాసాలతో సోషల్ మీడియా (Social Media)లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ యువ క్రీడాకారుడు, ధమర్ ప్రావిన్స్‌లోని హరధత్ దమ్త్ అగ్నిపర్వత బిలంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
Real Spider Man Death | మృతదేహం లభ్యం
సుమారు 120 మీటర్ల లోతు ఉన్న అగ్నిపర్వత బిలంలోని నిటారు కొండలను ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా అధిరోహించడానికి
అతను ప్రయత్నించాడు. ఈ సమయంలో పట్టుతప్పి పడిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు తీవ్రంగా శ్రమించి అతడి మృతదేహాన్ని వెలికి తీశాయి. బిలం అడుగున ఉన్న గంధకపు నీరు, ఆ ప్రాంతంలోని చేరుకోలేని నిర్మాణాల కారణంగా సహాయక చర్యలు గంటల తరబడి కొనసాగాయి.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi Student Conferences | పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీ సమరశంఖం.. దేశవ్యాప్తంగా విద్యార్థి సదస్సులు
