Birkoor House Theft | బీర్కూర్​లో దొంగల హల్​చల్​.. తాళం వేసిన ఇంట్లో చోరీ..

తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన బీర్కూర్​ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Birkoor House Theft | తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన బీర్కూర్​ మండల (Birkoor Mandal) కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

 Birkoor House Theft | బీర్కూర్​ మండల కేంద్రంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్​కు చెందిన వడ్ల రాజు కొత్త ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ప్రస్తుతం కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే తన పాత ఇంటికి తాళం వేసి ఉంచాడు. గురువారం రాత్రి ఆలస్యంగా ఇంటి వద్దకు వెళ్లిన రాజు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టబడి ఉండడాన్ని గమనించాడు. అనుమానం రావడంతో లోపలికి వెళ్లి పరిశీలించగా ఇంట్లోని సామన్లు చిందరవందరగా పడి ఉండడంతో పాటు బీరువా తెరిచి ఉండడం కనిపించింది.

బీరువాలో భద్రపర్చిన సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 13 తులాల వెండి ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరించి పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.Birkoor House Theft

ఇది కూడా చదవండి..: Shabbir Ali Notice | కాంగ్రెస్‌లో కలకలం.. సీనియర్ నేత షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *