నిజామాబాద్Gurukul School Facilities | విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Gurukul School Facilities | విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డొంకేశ్వర్ మండలం నూత్​పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Gurukul School Facilities | గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డొంకేశ్వర్ మండలం నూత్​పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే (Mahatma Jyotiba Phule) బీసీ బాలుర గురుకుల పాఠశాలను బుధవారం సందర్శించారు.

Gurukul School Facilities | మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..?

ఈ సందర్భంగా గురుకులంలోని (Gurukul schools) స్టోర్ రూం, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులు తదితర వాటిని కలెక్టర్​ పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీశారు. స్థానికంగా విద్యార్థులకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ పాఠశాలను ఆర్మూర్ (Armoor) పట్టణానికి తరలించే ప్రతిపాదనకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఆమోదం ఉందని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని ప్రతిపాదిత భవనాన్ని సైతం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ప్రస్తుతం నూత్​పల్లిలో ఉన్న భవనం కంటే ఇది సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలపగా, అవసరమైన మరమ్మతులు జరిపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Gurukul School Facilities | ప్రవేశాలు పెరిగేలా చూడాలి..

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్​ సూచించారు. ఆర్మూర్​లోని నూతన భవనంలో పాఠశాలను మారుస్తున్న విషయం గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ, వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలన్నారు. అంతకుముందు కలెక్టర్ 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా.. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్​సీవో సత్యనాథ్ రెడ్డి, ఆర్మూర్ తహశీల్దార్ సత్యనారాయణ తదితరులున్నారు.

collector

679

ఇది కూడా చదవండి: Vote Case | ఓటుకు నోటు’ కేసుపై విచారణ.. మరో రెండు వారాల పాటు వాయిదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....