Indian Sailor Death | ఒమన్ తీరంలో విషాదం.. భారత నావికుడి ప్రాణం తీసిన పోర్ట్ అధికారుల నిర్లక్ష్యం

ఒమన్ తీరంలో చిక్కుకున్న 'ఎంటీ సెలెస్టియల్' నౌకలో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుడు నిశాంత్ (35) అనారోగ్యంతో కన్నుమూశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Indian Sailor Death | ఒమన్ తీరంలో చిక్కుకున్న ‘ఎంటీ సెలెస్టియల్’ నౌకలో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుడు నిశాంత్ (35) అనారోగ్యంతో కన్నుమూశారు. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడమే ఆయన మరణానికి కారణమని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) ఆవేదన వ్యక్తం చేసింది. నిశాంత్ తమిళనాడుకు(  Tamil Nadu )చెందిన వారు.

Indian Sailor Death |ఏం జరిగింది?

నౌకలోని సెకండ్ ఆఫీసర్ అయిన నిశాంత్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమన్‌లోని ‘పోర్ట్ దుక్మ్’ (Port Duqm) వైఫై కమ్యూనికేషన్లను నిలిపివేసింది. ఫలితంగా నిశాంత్ పరిస్థితి విషమించడంతో, అత్యవసర వైద్య సాయం కోరుతూ సిబ్బంది ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదని సమాచారం. కనీస చికిత్స కూడా అందకపోవడంతో నిశాంత్ గురువారం ప్రాణాలు విడిచారు.

Indian Sailor Death |నౌక కెప్టెన్ ఆరోపణలు..

సాయం కోసం తాము చేసిన అభ్యర్థనలను నౌక యజమానులైన ‘రొమానా షిప్ మేనేజ్‌మెంట్ కో లిమిటెడ్’ (Romana Ship Management Co Ltd) , వారి స్థానిక ఏజెంట్లు పూర్తిగా విస్మరించారని నౌక కెప్టెన్ ఆరోపించారు. పోర్ట్ కంట్రోల్ అధికారులను పదేపదే సంప్రదించినా ఎటువంటి స్పందన రాలేదని ఆయన వాపోయారు.

Indian Sailor Death |మృతదేహం తరలింపులో నిర్లక్ష్యం..

మరణించిన నావికుడి మృతదేహాన్ని కూడా నౌకలోనే భద్రపరచకుండా వదిలేయడంపై FSUI తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన సంరక్షణ లేక మృతదేహం కుళ్లిపోయే స్థితికి చేరుకుందని ఆందోళన చెందింది. ప్రపంచ వాణిజ్యానికి వెన్నుముకగా నిలిచే నావికుల పట్ల ఇటువంటి నిర్లక్ష్యం తగదని, గౌరవప్రదంగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం , సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఎస్‌యూఐ విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి:  Hyderabad Heavy Rains | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం ఆదేశం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *