Abhijeet Deepke Attack | జైపూర్‌లో కలకలం.. కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్‌పై దాడి

నీట్ (NEET) పేపర్ లీకేజీ , నిరుద్యోగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Abhijeet Deepke Attack | నీట్ (NEET) పేపర్ లీకేజీ , నిరుద్యోగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వం వహించారు. అయితే, నిరసన జరుగుతున్న సమయంలోనే కొందరు దుండగులు ఒక్కసారిగా అభిజీత్ దీప్కేపై దాడి చేశారు.

Abhijeet Deepke Attack | దాడి వివరాలు..

ఆందోళనలో ఉన్న అభిజీత్ దీప్కే ముఖంపై దుండగులు బలంగా కొట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. దాడి వేగంగా జరగడంతో స్థానికులు, కార్యకర్తలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే దుండగులు తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Abhijeet Deepke Attack | గతంలోనూ బెదిరింపులు..

గత నెలలో కూడా అభిజీత్ దీప్కేకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ ద్వారా ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. అంతేకాకుండా, ఆయన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసేందుకు సైతం ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో, నిరసన కార్యక్రమంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే దాడి జరిగిందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టి, దాడి చేసిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి:  International Yoga Day 2026 | “కోల్‌కతాలో యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొననున్న ప్రధాని మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *