Software Engineer Suicide | వరంగల్‌లో విషాదం.. ఒత్తిడి తాళలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణం

సాఫ్ట్‌వేర్ రంగంలో పని ఒత్తిడి ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ఢిల్లీలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంజి కీర్తన (25) తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Software Engineer Suicide | సాఫ్ట్‌వేర్ రంగంలో పని ఒత్తిడి ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ఢిల్లీలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంజి కీర్తన (25) తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ నగరం, కాశీబుగ్గలో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Software Engineer Suicide | విపరీతమైన పనిభారం..

కాశీబుగ్గకు చెందిన గంజి ఉమాశంకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండో కుమార్తె కీర్తన ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా ఆఫీసులో విపరీతమైన పనిభారం (Work Pressure) కారణంగా కీర్తన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. కూతురు డిప్రెషన్‌లోకి వెళ్లడాన్ని గమనించిన తల్లిదండ్రులు, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో మూడు నెలల క్రితమే వరంగల్‌కు పిలిపించుకున్నారు. అప్పటి నుంచి ఆమె హనుమకొండలోని ఒక మానసిక వైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది.

Software Engineer Suicide | తల్లిదండ్రులు లేని సమయంలో..

ఈ క్రమంలోనే పరిస్థితి కొంత మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, కీర్తన తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఉమాశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రతిభావంతురాలైన యువతి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో కాశీబుగ్గలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి:  Vishal Sponsorship | సీఎం విజయ్​కు విషాల్ వినూత్న కానుక

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *