Chhattisgarh School Gayatri Mantra | బడుల్లో గాయత్రీ మంత్రం.. ఛత్తీస్​గడ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఛత్తీస్​గడ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో గాయత్రి మంత్రం పఠించాలని ఆదేశించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chhattisgarh School Gayatri Mantra | ఛత్తీస్​గడ్​ ప్రభుత్వం (Chhattisgarh Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ తమ పని దినాన్ని నిర్దిష్ట ప్రార్థనలు, కీర్తనలు, దేశభక్తి గీతాలతో ప్రారంభించి, ముగించాలని ఆదేశించింది.

పాఠశాలలు రోజువారీగా పాటించాల్సిన మూడు దశల కార్యక్రమ షెడ్యూల్​ను అధికారులు విడుదల చేశారు. ప్రతి విద్యా సంస్థలోనూ గాయత్రీ మంత్రంతో పాటు ఇతర హిందూ ప్రార్థనలు, జాతీయ గీతం, వందేమాతరం పఠనాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Chhattisgarh School Gayatri Mantra | జాతీయ గీతంతో..

Chhattisgarh School Gayatri Mantra

ఇకపై పాఠశాల రోజు విద్యార్థులు సమష్టిగా జాతీయ గీతం, వందేమాతరం పాడటంతో ప్రారంభమవుతుంది. ఆ వెంటనే దీప మంత్రం, సరస్వతీ వందన, గురు మంత్రం పఠిస్తారు. ఉదయపు సమావేశం (అసెంబ్లీ) ఒక ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్రలోని ఘట్టాన్ని చదవడంతో ముగుస్తుంది. మధ్యాహ్న భోజనానికి ముందు విద్యార్థులు ‘భోజన మంత్రం’ పఠించాలి. పాఠశాల పని వేళలు ముగిసే సమయానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గీతాన్ని పాడటంతో పాటు గాయత్రీ మంత్రం, శాంతి మంత్రాన్ని పఠిస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్​ విమర్శించింది. విద్యార్థులపై ఆర్​ఎస్​ఎస్​ ఎజెండాను రుద్దుతున్నారని కాంగ్రెస్​ నాయకులు సుశీల్​ శుక్లా అన్నారు.

ఇది కూడా చదవండి..: Cough Syrup Rules | దగ్గు మందుల విక్రయాలపై కఠిన నిబంధనలు విధించిన కేంద్రం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *