Anil Menon Mission | అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. జులై 14న తొలి యాత్ర

నాసా (NASA) వ్యోమగామి అనిల్ మేనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Anil Menon Mission | నాసా (NASA) వ్యోమగామి అనిల్ మేనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. జులై 14న కజకిస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఆయన ‘సోయుజ్ MS-29’ వ్యోమగామి నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరనున్నారు. ఆయనతో పాటు రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా ఈ యాత్రలో పాలుపంచుకోనున్నారు. వీరు సుమారు 8 నెలల పాటు (240 రోజులు) అంతరిక్షంలోనే ఉండి పరిశోధనలు చేస్తారు. ఈ యాత్రకు సంబంధించి జూన్ 22న ఆయన మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారని నాసా తెలిపింది.

Anil Menon Mission | బహుముఖ ప్రజ్ఞాశాలి..

అనిల్ మేనన్ స్వతహాగా అమెరికన్ పౌరుడు. ఆయన తల్లిదండ్రులు భారత్ , ఉక్రెయిన్‌కు చెందిన వారు. అనిల్ కేవలం వ్యోమగామి మాత్రమే కాదు, ఆయనకు పలు రంగాల్లో విశేష అనుభవం ఉంది. హార్వర్డ్ నుంచి న్యూరోబయాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, మెడిసిన్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్, మెకానికల్ ఇంజినీర్ , అమెరికా స్పేస్ ఫోర్స్‌లో కల్నల్‌గా పనిచేస్తున్నారు.
anil

Anil Menon Mission | ఎక్స్‌పెడిషన్ ఫ్లైట్ సర్జన్‌గా..

వ్యోమగామిగా ఎంపిక కాకముందు నాసాలో ఎక్స్‌పెడిషన్ ఫ్లైట్ సర్జన్‌గా పనిచేశారు. అలాగే స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థలో మొదటి ఫ్లైట్ సర్జన్‌గా సేవలు అందించారు. 2021లో నాసా వ్యోమగాముల బృందంలో ఎంపికైన అనిల్ మేనన్, రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత 2024లో వ్యోమగామిగా పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం చంద్రుడు, అంగారక గ్రహాలపై భవిష్యత్ పరిశోధనలకు అవసరమైన ప్రయోగాలను అంతరిక్ష కేంద్రంలో నిర్వహించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.

ఇది కూడా చదవండి: Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్​రావు విమర్శలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *