Mulugu IT Company | ములుగు జిల్లాలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mulugu IT Company | ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాంకేతిక రంగంలో కొత్త భవిష్యత్తుకు దారులు వేయాలని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఆమె ప్రారంభించారు.

ఇప్పటివరకు ఐటీ రంగం ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితమైందని మంత్రి సీతక్క అన్నారు. ఐటీ అవకాశాలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరిగితేనే మారుమూల ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

Mulugu IT Company | యువతకు శిక్షణ

శ్రియా ఇన్ఫోటెక్ సంస్థ గత ఒక సంవత్సరం కాలంగా ములుగు ప్రాంత యువతకు వివిధ రంగాల్లో సాంకేతిక శిక్షణ అందిస్తూ, యాప్ డెవలప్‌మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్‌లను అభివృద్ధి చేసి వివిధ పాఠశాలలు, సంస్థలు, ఐటీ రంగానికి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 15 మంది యువత ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు.

దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | సచివాలయంలో రేపు అనధికారిక కేబినెట్ భేటీ.. అజెండా ఇదే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *