E-Cabinet Telangana | తెలంగాణ పాలనలో డిజిటల్ విప్లవం..’ఈ-క్యాబినెట్’కు సర్కార్ గ్రీన్ సిగ్నల్

పరిపాలనలో వేగాన్ని, పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: E-Cabinet Telangana | పరిపాలనలో వేగాన్ని, పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ‘ఈ-క్యాబినెట్’ పద్ధతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో మంత్రుల భేటీలను కాగిత రహితంగా (Paper-less) మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

E-Cabinet Telangana | ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన..

సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ-క్యాబినెట్ విధానాన్ని పరిశీలించి, మన రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్ కార్పొరేటెడ్ (NICSI) తో చర్చలు జరిపి, ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు టీడీటీఎస్ (TDTS) ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ప్రాజెక్టు ప్రారంభానికి తొలి విడతగా రూ.20 లక్షల నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది.
cabinet.1

E-Cabinet Telangana | మంత్రులకు ట్యాబ్‌లు..

ఈ విధానంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి , మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లు లేదా కంప్యూటర్లను అందిస్తారు. క్యాబినెట్ ఎజెండాలు, ఫైళ్లు, ప్రతిపాదనలు , ప్రభుత్వ నిర్ణయాలన్నీ డిజిటల్ రూపంలోనే ఉంటాయి. మంత్రులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా సరే క్యాబినెట్ ఎజెండాలను పరిశీలించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల సమావేశాలకు ముందు , తర్వాత ఫైళ్ల నిర్వహణ సులభతరం అవుతుంది.

E-Cabinet Telangana | అత్యున్నత భద్రతా ప్రమాణాలు..

ప్రభుత్వ నిర్ణయాలు అత్యంత రహస్యమైనవి కాబట్టి, భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. సమాచారం లీక్ అవ్వకుండా, సాఫ్ట్‌వేర్ హ్యాక్ కాకుండా ప్రతి మంత్రికీ ప్రత్యేక లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను కేటాయిస్తారు. పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ఇది కూడా చదవండి: Diesel Theft from Train | ఆగి ఉన్న రైలులో డీజిల్ చోరీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *