Moscow Drone Attack | రష్యాపై ఉక్రెయిన్ ‘డ్రోన్’ వర్షం.. స్తంభించిన విమాన సేవలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Moscow Drone Attack | రష్యా-ఉక్రెయిన్ ( ukraine ) యుద్ధంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. రష్యా రాజధాని మాస్కోను టార్గెట్‌గా చేసుకుని ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. గత రెండేళ్ల కాలంలో మాస్కోపై జరిగిన అత్యంత భారీ దాడి ఇదేనని రష్యా మీడియా పేర్కొంటోంది. ఈ దాడుల తీవ్రతకు రాజధాని నగరం అట్టుడికిపోయింది.

Moscow Drone Attack | స్తంభించిన విమాన సేవలు..

డ్రోన్ దాడుల భయంతో మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. ముఖ్యంగా రద్దీగా ఉండే షెరెమెట్యేవో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆకాశంలో డ్రోన్లు దూసుకొస్తున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

Moscow Drone Attack | రిఫైనరీల వద్ద విధ్వంసం..

మాస్కోలోని ఆయిల్ రిఫైనరీకి సమీపంలో జరిగిన దాడితో భారీగా మంటలు చెలరేగి, నల్లని పొగ ఆకాశాన్ని తాకింది. అలాగే జోకోవ్‌స్కీ జిల్లాలోని ఒక అపార్ట్‌మెంట్ భవనంపై, మరోవైపు మాస్కో శివార్లలోని షాపింగ్ మాల్ సమీపంలో డ్రోన్లు పడటంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ప్రాణనష్టం గురించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Moscow Drone Attack | రష్యా వైమానిక రక్షణ వ్యవస్థల సవాల్..

తమ దేశంపైకి దూసుకొచ్చిన 500కు పైగా డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కేవలం మాస్కో వైపు వచ్చిన 180 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు పేర్కొంది. అయితే, ఉక్రెయిన్ ఈ దాడులకు సంబంధించిన వీడియోలను అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా పంచుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.

Moscow Drone Attack | సమ్మిట్ వేళ కలకలం..

కజన్ నగరంలో ప్రతిష్టాత్మక ‘ఆసియన్ నేషనల్ సమ్మిట్’ (ASEAN) జరగడానికి కొన్ని గంటల ముందు ఈ దాడులు జరగడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పలు ఆసియా దేశాల అధినేతలు పాల్గొనాల్సి ఉండగా, ఈ దాడులు రష్యా భద్రతా వ్యవస్థకు సవాలుగా మారాయి.

ఇది కూడా చదవండి: Chhattisgarh Sand Quarry | మైనింగ్ వివాదం.. బీజేపీ నేతతో సహా ముగ్గురు సజీవ దహనం

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *