Gunraj Gold Medal | ఐరన్​ వరల్డ్​ పవర్​ లిఫ్టింగ్​ చాంపియన్​షిప్​లో కాకతీయ విద్యార్థి ప్రతిభ

బ్యాంకాక్​లో ఐరన్​ వరల్డ్​ పవర్​ లిఫ్టింగ్​ ​లో పాల్గొన్న కాకతీయ పబ్లిక్​ స్కూల్​ విద్యార్థి డిల్లోడ్​ గన్​రాజ్​ ప్రతిభ చూపి బంగారు పతకం సాధించాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Gunraj Gold Medal | థాయిలాండ్​లోని బ్యాంకాక్​లో ఐరన్​ వరల్డ్​ పవర్​ లిఫ్టింగ్​ చాంపియన్​ షిప్​ పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో పాల్గొన్న కాకతీయ పబ్లిక్​ స్కూల్​ (Kakatiya Public School) విద్యార్థి డిల్లోడ్​ గన్​రాజ్​ ప్రతిభ చూపి బంగారు పతకం సాధించాడు.

Gunraj Gold Medal | ఏకంగా 195 కిలోలు ఎత్తి..

టోర్నీలో డిల్లోడ్​ ఘన్​రాజ్​ 195కిలోల బరువు ఎత్తి శభాష్​ అనిపించుకున్నాడు. బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారులు గన్​రాజ్​ను శుక్రవారం కాకతీయ పబ్లిక్​ స్కూల్​లో ఘనంగా సన్మానించారు. గన్​రాజ్​తో పాటు ఆయన తల్లిదండ్రులను సైతం స్కూల్​ యాజమాన్యం ఘనంగా సన్మానించించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ.. గన్​రాజ్​ ఇంటర్నేషనల్​ స్థాయిలో ప్రతిభచూపి గోల్డ్​మెడల్​ సాధించి కాకతీయ పాఠశాల పేరు నిలబెట్టాడన్నారు. కార్యక్రమంలో స్కూల్​ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Gunraj Gold Medal

ఇది కూడా చదవండి..: Gadugu Gangadhar | గడుగు గంగాధర్​ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *