Telangana Sports Development | రూ. 50.73 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Sports Development | రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ శివ్​ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి revanth పలు కార్యక్రమాలను ప్రారంభించారు.

రూ. 50.73 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ గారితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వర్చువల్‌గా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రూ. 36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రూ. 14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియాల్లో బాల బాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను ప్రారంభించారు.

Telangana Sports Development | శంకుస్థాపనలు చేసిన పనుల వివరాలు:

  • రూ. 10 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం.
  • రూ.10 కోట్లతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ.
  • రూ. 4 కోట్లతో నారాయణపేట్ జిల్లా నర్వ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం
  • రూ. 4 కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో మల్టీపర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖో- ఖో కోర్టుల నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి.
  • రూ. 3.50 కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం.
  • రూ. 2.65 కోట్లతో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం
  • రూ. 2.50 కోట్లతో నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్ & కబడ్డీ కోర్టుల నిర్మాణం.

Telangana Sports Development | ప్రారంభోత్సవాల వివరాలు:

  • రూ. 5.70 కోట్లతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ.
  • రూ. 35.95 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ.
  • రూ. 44.50 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ.
  • రూ. 58.50 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ అకాడమీ.
  • రూ. 49 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ అకాడమీ.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *