ABVP Telangana School Bandh | జూన్ 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ : ఏబీవీపీ పిలుపు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ABVP Telangana School Bandh | తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ – కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందంటూ ఏబీవీపీ ఆరోపించింది.

ABVP Telangana School Bandh | ఆర్థిక దోపిడీ

సర్కారు వైఖరిని నిరసిస్తూ జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పేర్కొంది. “ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం” అనే నినాదంతో ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటించింది.

ABVP Telangana School Bandh | పలు డిమాండ్లు

ఈ బంద్ సందర్భంగా విద్యార్థి సంఘం ప్రభుత్వం ఎదుట పలు డిమాండ్లు ఉంచింది.

పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ స్కూళ్లలో 23,000 స్కూళ్లను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి.

ఫీజుల నియంత్రణ చట్టం: ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టి, పటిష్టమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి.

విద్యా హక్కు చట్టం అమలు: ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు కేటాయించాల్సిన 25% సీట్ల విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.

ఉద్యోగాల భర్తీ: ఖాళీగా ఉన్న MEO, DEO పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

మౌలిక వసతులు, యూనిఫామ్స్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ వెంటనే పంపిణీ చేయాలి.

గురుకుల పాఠశాలల ఆధునికీకరణ: గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి. ఫుడ్ పాయిజన్‌కు తావులేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి.

NEP 2020 అమలు: నూతన జాతీయ విద్యా విధానం (NEP 2020) ను రాష్ట్రంలో అమలు చేయాలి.

బ్రేక్ ఫాస్ట్ స్కీమ్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో “బ్రేక్ ఫాస్ట్” స్కీమ్‌ను తక్షణమే పునఃప్రారంభించి అమలు చేయాలి.

వ్యాపారాల నివారణ: ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న బుక్స్, యూనిఫామ్స్ విక్రయాలను పూర్తిగా నిషేధించాలి.

ప్రభుత్వ విద్యావ్యవస్థను రక్షించుకోవడానికి, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్‌ను విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు జయప్రదం చేయాలని ఏబీవీపీ తెలంగాణ పిలుపునిచ్చింది.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *