అక్షరటుడే, వెబ్‌డెస్క్: Waterways Leisure Tourism IPO | వాటర్‌వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ ను 2020 నవంబర్‌లో స్థాపించారు. భారతీయ సంస్కృతి, ఆతిథ్యం, వినోదం, వంటకాలపై దృష్టి సారించి విలాసవంతమైన క్రూయిజ్ అనుభవాలను అందించే భారతదేశం (India)లోని ప్రముఖ దేశీయ సముద్ర క్రూయిజ్ ఆపరేటర్లలో ఇది ఒకటి.
ఈ సంస్థ ఎంవీ ఎంప్రెస్ అనే క్రూయిజ్ నౌకను నిర్వహిస్తుంది, ముంబయి, గోవా, కొచ్చి, చెన్నై, లక్షద్వీప్, విశాఖపట్నం, పుదుచ్చేరి వంటి దేశీయ గమ్యస్థానాలతో పాటు సింగపూర్, శ్రీలంకలోని హంబన్‌తోట, ట్రింకోమలీ, జాఫ్నా, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని కౌలాలంపూర్, లాంగ్‌కావి వంటి గమ్యస్థానాలకు అంతర్జాతీయ ప్యాకేజీలను అందిస్తోంది.
Waterways Leisure Tourism IPO | ఫ్రెష్ ఇష్యూ ద్వారా..
కంపెనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 10 ఫేస్ వాల్యూ కలిగిన 72,40,099 షేర్లను విక్రయించి, రూ. 585 కోట్ల నిధులు సమీకరించనుంది. ఇందులో రూ. 480 కోట్లను తన అనుబంధ సంస్థ అయిన బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన డిపాజిట్ లేదా అడ్వాన్స్ లీజ్ రెంటల్, నెలవారీ లీజ్ పేమెంట్ చెల్లింపులు చేయనుంది. మిగిలిన మొత్తాలను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
Waterways Leisure Tourism IPO | ధరల శ్రేణి

కంపెనీ ధరల శ్రేణిని రూ.769 – రూ. 808గా నిర్ణయించింది. ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ కనీసం 18 ఈక్విటీ షేర్ల(లాట్)ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ట ధర వద్ద రూ. 14,544తో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Waterways Leisure Tourism IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 75 శాతం, అలాగే రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం, ఎనఐఐలకు 15 శాతం వాటాను కంపెనీ కేటాయించింది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 45 గా ఉంది. ఐపీవో అలాట్‌మెంట్ లభించినట్లైతే సుమారు 5 శాతం లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి.
Waterways Leisure Tourism IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో జూన్ 23 న ప్రారంభం అవుతుంది. జూన్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. జూన్ 29 షేర్ల అలాట్‌మెంట్ జరగనుంది. కంపెనీ షేర్లు జూలై 01న ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు అయిన బీఎసఈ, ఎనఎసఈలలో లిస్టవనున్నాయి.
ఇది కూడా చదవండి..: June 21 Gold Prices | స్థిరంగా బంగారం ధరలు.. తులం పసిడి ఎంత ఉందంటే..