NEET Re Exam Scam | నీట్​ రీ ఎగ్జామ్​లో స్కామ్​.. 30 మంది అరెస్ట్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : NEET Re Exam Scam | నీట్​ రీ ఎగ్జామ్​లో మరో భారీ స్కాం బయట పడింది. పరీక్షలకు మోసాలకు పాల్పడేందుకు యత్నించిన 30 మందిని బీహార్ పోలీసులు (Bihar Police) అరెస్ట్​ చేశారు.

బీహార్‌లోని పలు పరీక్షా కేంద్రాలలో ఇంపర్సోనేషన్ (వేరొకరి స్థానంలో పరీక్ష రాయడం), మోసాలకు సంబంధించిన ఘటనలు వెలుగు చూశాయి. నీట్​ యూజీ పునఃపరీక్ష (re-examination) సందర్భంగా జిల్లా యంత్రాంగం, పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తనిఖీల సమయంలో మొత్తం 30 మందిని అరెస్టు చేశారు. వీరిలో అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది కూడా ఉన్నారు.

NEET Re Exam Scam | విచారణ ముమ్మరం

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లఖిసరాయ్‌లోని వివిధ పరీక్షా కేంద్రాలలో ఈ చర్యలు చేపట్టారు. KRK హై స్కూల్ పరీక్షా కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్‌పూర్ స్కూల్ పరీక్షా కేంద్రం నుంచి ఒకరు నకిలీ అభ్యర్థులు పట్టుబడ్డారు. అరెస్టు అయిన వ్యక్తులు వివిధ జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. ఈ తొమ్మిది మంది నకిలీ అభ్యర్థులతో పాటు, పరీక్షా మోసానికి సంబంధించి మరో 21 మందిని కూడా అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌లో వారి పాత్రపై అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ నెట్‌వర్క్‌లో మరికొంత మంది ప్రమేయం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: CM Vijay Temple Funds | ఆలయ నిధులు ఇకపై మతపరమైన అవసరాలకే : డీఎంకే ప్రాజెక్టులపై సీఎం విజయ్ ‘సర్జికల్ స్ట్రైక్’!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *