అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda Tragedy | నల్గొండ (Nalgonda) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
నల్గొండలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీ (Telangana colony)లో ఎండీ సుల్తాన్, హసీనా దంపతులు నివసిస్తున్నారు. సుల్తాన్ బ్యాగుల వ్యాపారం చేస్తుండగా.. హసీనా ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. అయితే వారి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా నలుగురి మృతదేహాలు ఉన్నాయి.
Nalgonda Tragedy | కుళ్లిన స్థితిలో..
మృతుల్లో సుల్తాన్, హసీనాతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వారి వివరాలు తెలియరాలేదు. అయితే వీరు నాలుగు–ఐదు రోజుల క్రితం చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. వీరు ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కుటుంబానికి చెందిన మరో యువకుడు కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. దీంతో హత్య కోణంలోనూ వన్ టౌన్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
దీనిని కూడా చదవండి : Farmer Seed Fairs | రైతు వేదికల్లో విత్తన మేళాలు.. ఇప్పటికే నార్లు పోసిన రైతులు