అక్షరటుడే, వెబ్‌డెస్క్: Angapradakshina Tokens| తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Angapradakshina Tokens |ఉచితంగా అందుబాటులో
అంగప్రదక్షిణం సేవలో పాల్గొనాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టోకెన్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టోకెన్లు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉండటంతో ప్రతి నెల విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా బుక్ అవుతున్నాయి.
దీంతో భక్తులు ముందుగానే తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలకు టోకెన్ల విడుదల ప్రారంభం కానుండటంతో, కనీసం రెండు నుంచి మూడు నిమిషాల ముందే వెబ్సైట్ లేదా యాప్‌లో ప్రవేశించి బుకింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

Angapradakshina Tokens | భక్తిశ్రద్ధలతో అంగప్రదక్షిణం
అంగప్రదక్షిణం సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రమైన సేవలలో ఒకటిగా భావించబడుతుంది. భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో అంగప్రదక్షిణం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. అందువల్ల ఈ సేవకు విశేష ఆదరణ ఉంది.
భక్తులు అంగప్రదక్షిణం టోకెన్ల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
బుకింగ్ వెబ్సైట్: https://ttdevasthanams.ap.gov.in
Mamata Banerjee TMC | బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. TMC చీఫ్ పదవి నుంచి మమత తొలగింపు!