అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flipkart GOAT Sale | ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart).. ప్రత్యేక సేల్ కు సిద్ధమైంది. జులై 4 నుంచి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) సేల్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్లస్ లేదా బ్లాక్ మెంబర్స్‌కు 24 గంటల ముందే అంటే జులై 3నుంచే సేల్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Flipkart GOAT Sale | కార్డ్ ఆఫర్లు..
గోట్ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతోపాటు పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. ఐఫోన్ 17, శాంసంగ్, మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌పై భారీగా ఆఫర్లు అందించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఆఫర్లను ఇంకా రివీల్ చేయలేదు. సేల్‌కు ముందు ఆఫర్లను రివీల్ చేసే అవకాశాలున్నాయి. కాగా ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ (HSBC Bank) క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు ధర వర్తించనుంది.
ఇది కూడా చదవండి..: Stock Market Gains | ఊగిసలాటలో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు..