Stock Market Gains | ఊగిసలాటలో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 83 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | యూఎస్ -ఇరాన్ చర్చలలోని పరిణామాలను ఇన్వెసర్లు గమనిస్తుండడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. ప్రపంచ మార్కెట్లనుంచి సంకేతాలు మిశ్రమంగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ స్పల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతోంది.

Stock Market Gains | స్వల్ప నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 208 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 314 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 31 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి కోలుకుని 95 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 77,177 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 24,126 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో, 12 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సన్‌ఫార్మా 1.55 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) 1.18 శాతం, ఎటర్నల్ 0.97 శాతం, ఎల్టీ 0.89 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.86 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 2.82 శాతం, టీసీఎస్ 2.56 శాతం, టెక్ మహీంద్రా 2.32 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.17 శాతం, టాటా స్టీల్ 0.93 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: June 23 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *