Laksha Flats Scheme | లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

పోటీలో పాల్గొనదలిచిన వారు హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా tghd.official ద్వారా తమ సూచనలను పంపవచ్చని పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Laksha Flats Scheme | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజీ) ప్రజల కోసం క్యూర్ (Core Urban Region Expansion) పరిధిలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారు చేసేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Laksha Flats Scheme | ప్రతిష్ఠాత్మక పథకం..

ఈ ప్రతిష్ఠాత్మక పథకానికి ప్రజల నుంచే ఆకర్షణీయమైన పేరును స్వీకరించాలని నిర్ణయించిన బోర్డు, ఉత్తమ పేరును సూచించిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించింది.

ఈ మేరకు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. ఈ నెల 28వ తేదీ వరకు సోషల్ మీడియా వేదికగా బహిరంగ పోటీ నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ సూచనలను పంపాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ పరిధిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా లక్ష ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Laksha Flats Scheme | విశేష ఆదరణ

వివాదరహితంగా, అందుబాటు ధరల్లో గృహాలను అందించడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉందని గౌతం తెలిపారు. బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన పలు గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ప్రజల నుంచి విశేష ఆదరణతో పాటు డిమాండ్ కూడా లభించిందని గుర్తు చేశారు.

సుదీర్ఘ విరామం అనంతరం చేపడుతున్న ఈ భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో పథకానికి పేరును కూడా ప్రజల సూచనల ఆధారంగానే ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన పేర్లలో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసి, సూచించిన వ్యక్తికి రూ.1 లక్ష బహుమతి అందజేస్తామని తెలిపారు.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Untitled 1.jpglakh

Laksha Flats Scheme | ఇన్‌స్టాగ్రామ్ ఖాతా

పోటీలో పాల్గొనదలిచిన వారు హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా tghd.official ద్వారా తమ సూచనలను పంపవచ్చని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించినట్లు గౌతం తెలిపారు.

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, లాటరీ విధానంలో గృహాలను కేటాయించనున్నట్లు చెప్పారు. పూర్తి విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *