June 24 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 24 Market Analysis | సెమీకండక్టర్ స్టాక్స్‌లో భారీ నష్టాలు, ద్రవ్యోల్బణం (Inflation) విషయంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న కఠిన వైఖరి రేకెత్తిస్తున్న ఆందోళనల కారణంగా మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.

యూరోప్ మార్కెట్లు వాల్‌స్ట్రీట్‌ను అనుసరించాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Giftnifty) క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్ప ప్రీమియంతో ట్రేడ్ అవుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

June 24 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

టెక్నాలజీ, సెమీకండక్టర్ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ గత సెషన్‌లో నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్(Nasdaq) 2.08 శాతం, ఎస్ అండ్ పీ 1.44 శాతం నష్టపోగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ఉంది.

June 24 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.99 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.71 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.09 శాతం నష్టపోయాయి.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

June 24 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.74 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.44 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.10 శాతం లాభాలతో ఉండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.69 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.33 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.28 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.22 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IAS Gandham Chandrudu Story | రూ.ఐదు ‘లంచం’.. ఎండిన డొక్క.. ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడి ‘సర్టిఫికెట్ కథ’!

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 18 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 680 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలహీనపడి 94.73 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.41 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.50 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 76.45 డాలర్ల వద్ద ఉంది.

భారత్‌తో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని వాషింగ్టన్ చాలా చాలా దగ్గరగా ఉందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరోలోని యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ బెథానీ పౌలోస్ మోరిసన్ చెప్పినట్లు ANI నివేదించింది.

June 22 Horoscope | వ్యాపారస్తులకు లాభాలు.. ఉద్యోగులకు ప్రమోషన్.. ఈ రాశుల వారిది మహర్జాతకం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *