Stock Market Gains | తగ్గిన క్రూడాయిల్ ధర.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 287 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మరియు దాని వాణిజ్య భాగస్వాములపై అమెరికా ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ, వాషింగ్టన్ ఆంక్షలకు కఠినంగా ప్రతిస్పందిస్తామని టెహ్రాన్ హెచ్చరిస్తున్నప్పటికీ ద్వితీయార్థంలో స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా కోలుకున్నాయి. లాభాల స్వీకరణ కారణంగా క్రూడ్ ఆయిల్ ధర దిగిరావడం, రూపాయి విలువ బలపడడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి.

Stock Market Gains | నష్టాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం ఒడిదుడుకుల మధ్య సాగి లాభాలతో ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 74 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై అక్కడినుంచి 95 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 265 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో మొదలై 23 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 83 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు పుంజుకున్నాయి. చివరి రెండు గంటల్లో సెన్సెక్స్ 541 పాయింట్లు, నిఫ్టీ 219 పాయింట్లు పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 287 పాయింట్ల లాభంతో 77,6565 వద్ద, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 24,334 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,099 కంపెనీలు లాభపడగా 2,227 స్టాక్స్ నష్టపోయాయి. 199 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 153 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 92 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్ లాభపడగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 2.05 శాతం, ఆదానీపోర్ట్స్ 1.19 శాతం, ఇన్ఫోసిస్ 1.15 శాతం, ట్రెంట్ 1.10 శాతం, టైటాన్ 0.98 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎటర్నల్ 0.85 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.68 శాతం, పవర్‌గ్రిడ్ 0.53 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.29 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.26 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాలు కంటిన్యూ..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *