Fake Number Plates | నకిలీ నంబర్​ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

నకిలీ నంబర్​ ప్లేట్లు వినియోగిస్తున్న వారిపై హైదరాబాద్​ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Number Plates | హైదరాబాద్​ నగరంలో పలువురు తమ వాహనాలకు నకిలీ నంబర్​ ప్లేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్రాఫిక్​ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఫేక్​ నంబర్​ ప్లేట్లు వినియోగిస్తున్నారు. దీంతో వారు చేసిన ట్రాఫిక్​ ఉల్లంఘనలకు ఇతరులకు.. చలాన్లు పడుతున్నాయి. దీంతో నగర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు, నకిలీ, మార్పులు చేసిన లేదా అనధికృత రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. వారం రోజుల్లో మెహదీపట్నం, మహంకాళి, టోలీచౌకి, గుడిమల్కాపూర్, అంబర్‌పేట్, ఛత్రినాక, సంతోష్‌నగర్, సనత్‌నగర్ మరియు సైఫాబాద్ వంటి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 క్రిమినల్ కేసులు చేశారు. వాహన గుర్తింపును దాచడానికి, చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్లను మార్చి ప్రదర్శించిన అనేక వాహనాలపై కేసులు నమోదు చేశారు.

Fake Number Plates | ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలి

వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మోసపూరిత చర్యల పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన వైఖరి అనుసరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో ఫైన్​లు వేసి వదిలేసేవారు. ప్రస్తుతం కేసులు నమోదు చేస్తున్నారు. అధికారికంగా ఆమోదించబడిన రిజిస్ట్రేషన్ ప్లేట్లను మాత్రమే ఉపయోగించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు.

దీనిని కూడా చదవండి : Executive Engineer Bribery | వారంలో రిటైర్మెంట్​.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *