అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump India Tariffs | అమెరికా ఎగుమతులపై భారత్ విధిస్తున్న సుంకాల విషయంలో డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘రెజీమ్ ఛేంజ్’ అనే కొత్త పుస్తకంలో వెల్లడైన వివరాల ప్రకారం.. ట్రంప్ తన వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ , ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trump India Tariffs | ఎందుకీ వివాదం?
ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొత్తలో, వివిధ దేశాలు అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాల గణాంకాలను వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) ఆయన ముందు ఉంచింది. అయితే, ఆ నివేదికలో భారత్ విధిస్తున్న సుంకాలు తక్కువగా ఉండటాన్ని చూసి ట్రంప్ మండిపడ్డారు. అమెరికా వస్తువులపై భారత్ కనీసం 175 శాతం సుంకాలు విధిస్తోందని ఆయన వాదించారు.
Trump India Tariffs | తప్పుడు డేటా ఇస్తున్నారు..
అధికారులు అందించిన గణాంకాలను “చెత్త డేటా” అని కొట్టిపారేసిన ట్రంప్, చైనా , భారత్ వంటి దేశాలు అమెరికాపై వేస్తున్న సుంకాల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డారు. తన వాదనను వివరించడానికి లుట్నిక్ ప్రయత్నించినప్పటికీ, ట్రంప్ మాత్రం ఆయన మాటలను తోసిపుచ్చారు. విదేశాలపై భారీ సుంకాలను విధించే వ్యూహాన్ని రూపొందిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
Trump India Tariffs | గతంలోనూ ట్రంప్ విమర్శలు..
భారత్‌పై ట్రంప్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో, ప్రపంచ దేశాల్లో భారత్ మాత్రమే అమెరికా ఎగుమతులపై అత్యధిక సుంకాలు విధిస్తోందని ఆయన పదేపదే విమర్శించేవారు. అదే సమయంలో ట్రంప్ సలహాదారు పీటర్ నవారో సైతం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాతి పరిణామాల్లో భాగంగానే ట్రంప్ భారత్‌పై భారీగా సుంకాలను అమలు చేశారు.
ఇది కూడా చదవండి: Kamareddy Flood Prevention | వరదల నియంత్రణకు చర్యలు.. డ్రైనేజీలు, కాలువల్లో పూడికతీత