Government School | కన్కల్ సర్కారు బడిని ఆదర్శంగా తీసుకోవాలి..: డీఈవో మల్లికార్జున్

కన్కల్ ప్రభుత్వ పాఠశాలను మిగితా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి డీఈవో మల్లికార్జున్ పిలుపునిచ్చారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, తాడ్వాయి: Government School | కన్కల్ (Kankal Village) ప్రభుత్వ పాఠశాలను మిగితా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి (Kamareddy) డీఈవో మల్లికార్జున్ పిలుపునిచ్చారు. బుధవారం తాడ్వాయి మండలం కన్కల్‌లో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Government School | 145 మంది ప్రైవేట్​ నుంచి సర్కారుకు..

గ్రామస్తుల చొరవతో 145 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు గుడ్‌బై చెప్పి సర్కారు బడిలో చేరడం గర్వకారణమన్నారు. సర్పంచ్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో 15 మందితో కమిటీ ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణ చేపట్టారని, అన్ని వసతులూ కల్పిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం వద్దని, సర్కారు బడుల్లో (Government Education) నాణ్యమైన విద్య, భోజనం, పుస్తకాలు ఉచితంగా లభిస్తాయని గుర్తుచేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రామస్వామి, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Corporate School Fees

 

ఇది కూడా చదవండి: కర్ణాటక కేబినెట్ విస్తరణ.. లాబీయింగ్‌పై హైకమాండ్ ఆగ్రహం 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *