Samantha Pregnancy News | ప్రెగ్నెన్సీ వార్తలపై సమంత క్లారిటీ.. మెటర్నిటీ లీవ్ తీసుకుంటానన్న నటి

సమంత చేసిన ఈ ప్రకటనతో ఆమె ప్రెగ్నెన్సీపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు, ప్రచారాలకు తెరపడినట్టైంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Samantha Pregnancy News | ప్రముఖ సినీ నటి Samantha Ruth Prabhu తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలపై స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Samantha Pregnancy News | విరామం తాత్కాలికమే

తాను కొంతకాలం పాటు మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నట్లు సమంత వెల్లడించారు. అయితే ఈ విరామం తాత్కాలికమేనని, అనంతరం మళ్లీ యథావిధిగా సినిమాల్లోకి వచ్చి నటనను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

తన కెరీర్‌కు ఎలాంటి విరామం ఉండదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. సమంత చేసిన ఈ ప్రకటనతో ఆమె ప్రెగ్నెన్సీపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు, ప్రచారాలకు తెరపడినట్టైంది.

Samantha Pregnancy News | పలు ప్రాజెక్టుల్లో..

ఇక ప్రస్తుతం సమంత నటిగా పలు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికల్లో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఆరోగ్యం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Klimkara face reveal | ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార’ ఫేస్ రివీల్.. నెట్టింట రామ్ చరణ్, ఉపాసన దంపతుల క్యూట్ పిక్ వైరల్!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *